అనుమతులకు మించి ఇసుక తరలింపుతో భూగర్భ జలాలకు పర్యావరణ నష్టాలకు దారితీస్తుందని అనుమతులను పర్యవేక్షించడం అవసరమని శనివారం బీఎస్పీ పార్టీ దేవరకద్ర నియోజకవర్గ ఇన్చార్జి బసిరెడ్డి సంతోష్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల, కౌకుంట్ల మండలాల మధ్య ఉకచెట్టు వాగులో అనుమతులకు మించి ఇసుక తవ్వడం, రవాణా చేయడం భూగర్భ జలాలు, పర్యావరణ నష్టాలకు దారితీస్తుందని, సమస్యను పరిష్కరించడానికి, ఇసుక అక్రమ రవాణాపై నిఘా ఉంచాలన్నారు.