దేవరకద్ర కేంద్రంలో మే 21 న మహబూబ్ నగర్ జిల్లా కందూరు రామిరెడ్డి లయన్స్ కంటి హాస్పిటల్, జిల్లా అంధత్వ నివారణ సంస్థలో సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేయనున్నట్టు శుక్రవారం క్యాంపు ఇన్‌చార్జ్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఉదయం 10: 00 గంటలకు మధ్యాహ్నం 1: 00 గంటల వరకు కొనసాగుతుందన్నారు. కంటి సమస్యలు ఉన్నవారు ఈ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.