ఈ నెల 22 నుంచి 29 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను సాఫీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ సప్లిమెంటరీ పరీక్షల కోసం మొత్తంగా 19 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. మొదటి సంవత్సరం 5, 787 మంది, రెండో సంవత్సరం 3, 282 మంది పరీక్షలు రాయనున్నారని అన్నారు.