పాలమూరు జిల్లాలోని పిల్లలమర్రి మహావృక్షాన్ని శుక్రవారం సందర్శించేందుకు వచ్చిన 72వ మిస్ యూనివర్స్ పోటీలలో పాల్గొనే అంతర్జాతీయ సుందరీమణులు పిల్లలమర్రి ఆడిటోరియం వద్ద బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు. ఈ సందర్భంగా బంతిపూలతో ఏర్పాటు చేసినటువంటి బతుకమ్మల చుట్టూ సంప్రదాయ పద్ధతిలో బతుకమ్మ ఆడారు. వారికి నియోజకవర్గానికి చెందిన సాంస్కృతిక విభాగం వారు జత కలిశారు.