రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా న్యూటౌన్ లో గురువారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. నారాయణపేట జిల్లాకు చెందిన శశాంక్ (19), నల్గొండకు చెందిన జ్ఞానేశ్వర్ (18) పట్టణంలోని మెడికల్ కాలేజీలో బీఎస్సీ చదువుతున్నారు. బైక్ ఫై వెళుతున్న ఇద్దరూ ఆగి ఉన్న లారీని ఢీకొట్టగా తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనఫై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.