మహబూబ్ నగర్ జిల్లా డీసీసీబీకి ఐఎస్ఓ గుర్తింపు లభించినట్టు డీసీసీబీ ఛైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఐఎస్ఓ సర్టిఫికెట్ ను అందుకున్నామని అన్నారు. డీసీసీబీ కార్యకలాపాలు సమర్ధవంతంగా తీసుకున్న నేపథ్యంలో గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. ఈ సందర్భంలో పీఏసీఎస్ ఛైర్మన్ల ఫోరం సభ్యులు డీసీసీబీ ఛైర్మన్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.