మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పిల్లలమర్రిలో 20 దేశాలకు చెందిన ప్రపంచ సుందరిమణులు సందడి చేశారు. శుక్రవారం వారికి వివిధ ప్రదేశాలను, జిల్లా విశిష్టతను అధికారులు వివరించారు. 750 సంవత్సరాల చరిత్ర గల పిల్లలమర్రి వృక్షం, పురావస్తు మ్యూజియం, రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించారు. వారు కళాకృతులు చూసి ఆశ్చర్యపోయారు. కార్యక్రమంలో మంత్రి జూపల్లి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, ఎస్పీ పాల్గొన్నారు.