అలంపూర్: 'ప్రతి పౌరుడు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి'

69చూసినవారు
జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం మద్దూరులో శనివారం న్యాయ విజ్ఞాన సదస్సులో అల్లంపూర్ సివిల్ కోర్టు జడ్జి మిథున్ తేజ హాజరయ్యారు. ప్రతి పౌరుడు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఆర్థిక లావాదేవీలు, భూ క్రయవిక్రయాలలో కచ్చితంగా లిఖితపూర్వక పత్రాలు కలిగి ఉండాలన్నారు. రైతులు విత్తనాలు, ఎరువులు ఖరీదు చేసినప్పుడు కచ్చితంగా రసీదు తీసుకోవాలన్నారు. నష్టం వాటిల్లితే రసీదుతో న్యాయపరంగా లబ్ధికి అవకాశం ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్