స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రగ్స్ రహిత సమాజం వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విజేతలకు జోగులాంబ గద్వాల ఎస్పీ టి. శ్రీనివాసరావు గురువారం పోలీస్ కార్యాలయంలో ప్రశంసా పత్రాలు అందజేశారు. మొదటి విజేత ప్రభుత్వ కళాశాల విద్యార్థిని శిరీష, 2వ విజేత బాలికల పాఠశాల విద్యార్థిని రాజేశ్వరి, 3వ విజేత ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని శ్రావణిని అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు.