అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

78చూసినవారు
అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం శెట్టిఆత్మకూరులో అంగన్వాడీ కేంద్రాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ బీ. ఎం. సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొత్తగా వేసిన పెయింటింగ్, పిల్లల అభ్యాసన సామర్ధ్యాన్ని పరిశీలించారు. పిల్లలందరికీ రెండు జతల యూనిఫామ్ వెంటనే అందజేయాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలను తప్పనిసరిగా ఉదయం 9: 00 గంటల నుంచి సాయంత్రం 4: 00 గంటల వరకు నిర్వహించాలని కలెక్టర్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్