గద్వాల: సీఎం సహాయ నిధి పేదల పాలిట వరం: ఎమ్మెల్యే

70చూసినవారు
గద్వాల: సీఎం సహాయ నిధి పేదల పాలిట వరం: ఎమ్మెల్యే
జోగులాంబ గద్వాల జిల్లా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం గట్టు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 85 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం సహాయనిధి పథకం పేదలకు వరం లాంటిదని, దరఖాస్తు చేసుకోనిన 85 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి రూ. 2. 50 కోట్ల విలువైన చెక్కులు మంజూరయ్యాయని అన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్