గద్వాల: నేడు నిరుద్యోగ యువతకు జాబ్ మేళా

53చూసినవారు
గద్వాల: నేడు నిరుద్యోగ యువతకు జాబ్ మేళా
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో శనివారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జోగులాంబ గద్వాల జిల్లా ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ సత్యనారాయణ తెలిపారు. గద్వాల పట్టణంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో గల ప్రభుత్వ ఐటీఐలో ఉదయం 10: 00 గంటలకు జాబ్ మేళా ఉంటుందన్నారు. ఇందులో ప్రైవేట్ సంస్థల వారు పాల్గొని తమకు అవసరమైన అభ్యర్థులను ఎంపిక చేసుకుంటారని అన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్