జోగులాంబ గద్వాల జిల్లా కేటి దొడ్డి కేజీబీవీ జూనియర్ కళాశాలలో బైపీసీ, ఫార్మా టెక్నాలజీ గ్రూపుల్లో ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ పద్మావతి తెలిపారు. అడ్మిషన్లను సోమవారం స్వీకరిస్తామని, బైపీసీ గ్రూపులో 40, ఫార్మా టెక్నాలజీ 40సీట్లు ఉన్నాయని 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఆన్ లైన్ మెమో, బోనఫైడ్, ఆధార్ కార్డ్, పాస్ పోర్ట్ సైజ్ ఫొటో, కుల, ఆదాయ ధ్రువపత్రాలతో కళాశాలకు రావాలన్నారు.