రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 2న తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సేవా పథకాలలో జోగులాంబ గద్వాల జిల్లా నుంచి ఎంపికైన ఏడుగురు అధికారులను ఎస్పీ శ్రీనివాసరావు గురువారం జాతీయ జెండావిష్కరణ అనంతరం పథకాలతో సత్కరించారు. ఈశ్వరయ్య ఎఎస్ఐ, రాజశేఖర్ ఎఆర్ఎస్ఐ, హెడ్ కానిస్టేబుళ్లు వెంకటేశ్వర్లు, రామిరెడ్డి, ప్రభాకర్, శ్రీనివాస్ లతో పాటు ఎఆర్ హెచ్సి శివ చారి పథకాలు అందుకున్న వారిలో ఉన్నారు.