బిఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి గద్వాల జెడ్పీ ఛైర్మన్ గా పని చేసిన సరిత తిరుపతయ్య కాంగ్రెస్ పార్టీలో చేరి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయింది. బిఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన కృష్ణ మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరికను ఆమె తీవ్రంగా వ్యతిరేకించగా ఆమెను బుజ్జగించేందుకు రాష్ట్ర కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు పదవి ఇస్తున్నట్లు గద్వాల నియోజకవర్గంలో జోరుగా చర్చ జరుగుతుంది.