ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో 87. 0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ లో 21. 3 మిల్లీమీటర్లు, నారాయణ పేట్ జిల్లా గుండుమల్లో 1. 3 మిల్లీమీటర్లు, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలో '0' మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.