మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో శనివారం నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే ధ్యేయంగా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర పీసీసీ అబ్జర్వర్ల ఉపాధ్యక్షుడు సాంబయ్య భాస్కర్, డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు.