మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాదేపల్లి పత్తి మార్కెట్ లో వరి ధాన్యం కొనుగోలు చేయాలని గురువారం 167వ జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలలో ఉన్న వరి ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.