జడ్చర్ల: వర్షాకాలం దృష్ట పురపాలికలో ముందస్తు చర్యలు

56చూసినవారు
జడ్చర్ల: వర్షాకాలం దృష్ట పురపాలికలో ముందస్తు చర్యలు
జడ్చర్ల పురపాలక పరిధిలోని 4, 17, 20వ వార్డులలో శుక్రవారం చైర్ పర్సన్ కోనేటి పుష్పలత, మున్సిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డి పర్యటించారు. రాబోవు వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని మురుగునీరు రోడ్లపై పారకుండా ఉండేందుకు డ్రైనేజీలలో పేరుకుపోయిన చెత్తాచెదారంను సోమవారం నుండి తొలగింపు చర్యలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు దేవా, చైతన్య, ప్రశాంత్ రెడ్డి, నాయకులు కోనేటి నరసింహులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్