మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాతపాలమూరులో వాహనాలు బ్రిడ్జిపై ఇష్టారాజ్యంగా పార్కింగ్ చేసి వాహనదారులకు ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మహబూబ్ నగర్ నుంచి భూత్ పూర్ వెళ్లే రహదారి మార్గంలో నూతనంగా నిర్మించిన బ్రిడ్జిపై వాహన యజమానులు ప్రమాదాలు జరుగుతున్న పట్టింపు లేకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. రహదారుల, మున్సిపల్, పోలీస్ శాఖ సమన్వయంతో వాహన యజమానులకు హెచ్చరికలు జారీ చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.