మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన శనివారం తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఎంపీ మాట్లాడుతూ. దేశ రక్షణే ధ్యేయంగా ఆపరేషన్ సింధూర్ లో పోరాడి ప్రాణాలు అర్పించిన వీర సైనికుడు, అమర జవాన్ మురళీ నాయక్ కు ఘన నివాళులు అర్పిస్తున్నామన్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ కు ఇదో హెచ్చరిక మాత్రమేనని, భారత్ వైపు కన్నెత్తి చూస్తే అంతుచూస్తామన్నారు.