బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పి కొట్టాలని నాయకులు, కార్యకర్తలకు దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం జరిగిన దేవరకద్ర మార్కెట్ యార్డు నూతన కమిటీ ప్రమాణ స్వీకారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేవరకద్ర నియోజకవర్గంలో రూ. 224 కోట్ల రుణమాఫీ జరిగిందన్నారు. అదే విధంగా 46 వేల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.