కమలం పువ్వులతో వాసవి కన్యకా పరమేశ్వరికి అలంకరణ

85చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణవాడ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో శుక్రవారం వరలక్ష్మి వ్రతాలను భక్తిని శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంలో అమ్మవారిని 1600 కమలం పువ్వులతో ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆలయంలో తెల్లవారుజామునుండే ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణమాసం ఆసాంతం ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని అర్చకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్