ఉమ్మడి జిల్లాలోని రుణమాఫీ వివరాలు

81చూసినవారు
ఉమ్మడి జిల్లాలోని రుణమాఫీ వివరాలు
మూడో విడత రుణమాఫీ(రూ. 1. 5 నుంచి 2 లక్షలు)ని సీఎం రేవంత్ రెడ్డి గురువారం ప్రారంభించారు. దీంతో మహబూబ్ నగర్ జిల్లాలో 11, 458 మంది రైతులకు రూ. 138. 75 కోట్లు, నాగర్ కర్నూల్ లో 21, 352 మంది రైతులకు 261. 36 కోట్లు, జోగులాంబ గద్వాలలో 9550 మంది రైతులకు 121. 91 కోట్లు, వనపర్తిలో 10, 047 మందికి రూ. 126. 63 కోట్లు రైతుల ఖాతాలలో శుక్రవారం జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్