దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను శనివారం లబ్ధిదారులకు అధికారులతో కలసి ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జియంఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.