78వ స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో భాగంగా గురువారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. ఈ సందర్భంగా స్టాల్ ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వ గురుకుల పాఠశాల ఉద్యోగులు మంత్రి జూపల్లి కృష్ణారావు, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి, కలెక్టర్ విజయేంద్ర బోయి లకి రాఖీలు కట్టారు.