రానున్న రాఖీ పండుగ రోజు రీజియన్ లోని డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర ఉద్యోగులు కష్టపడి పనిచేసి మంచి మెరుగైన ఆదాయం తెద్దామని మహబూబ్ నగర్ రీజినల్ మేనేజర్ వి. శ్రీదేవి పిలుపునిచ్చారు. నూతనంగా రూపొందించిన ఈపీకే బుక్ ను శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ లో ఆర్ఎం పంపిణీ చేశారు. రీజియన్ లో ఇప్పటి వరకు 1, 800 బుక్స్ పంపిణీ చేశామని తెలిపారు.