మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో గుర్తు తెలియని వృద్ధుడు చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడని రూరల్ ఎస్ఐ విజయ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. గత రాత్రి గుర్తు తెలియని వృద్ధుడు అపస్మారక స్థితిలో ఉన్నాడన్న సమాచారంతో అతన్ని జనరల్ ఆసుపత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు. మృతదేహాన్ని జనరల్ ఆసుపత్రి మార్చురీకి తరలించామని తెలిపారు.