మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, డీకే భరతసింహా రెడ్డి దంపతులు శుక్రవారం బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారికి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పురోహితులు వారికి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. కనక దుర్గమ్మ ఆశీర్వాదాలతో తాను ఎంపీగా గెలిచానని తెలిపారు. అమ్మవారి ఆశీర్వాదాలు ప్రజలందరిపై ఉండాలని కోరినట్లు తెలిపారు.