జడ్చర్లలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆసక్తికర ఘటన గురువారం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్ రెడ్డి ఓవిద్యార్థినికి షూ వేశారు. జడ్చర్ల నియోజకవర్గంలో విద్యార్థులకు బూట్ల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థినికి ఆయన స్వయంగా బూట్లు తొడిగి అందరిని ఆశ్చర్య పరిచారు. ఎమ్మెల్యే నిరాడంబరతకు స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.