బంగ్లాదేశ్ దేశంలో హిందువులపై, హిందూ దేవాలయాలపై జరుగుతున్న దమనకాండకు నిరసనగా శనివారం హిందూ ఐక్యవేదిక చేస్తున్నటువంటి మహబూబ్ నగర్ బందుకు వస్త్ర వ్యాపారుల తరఫున సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్టు వస్త్ర వ్యాపారుల సంఘం నాయకులు సీమ నరేందర్ తెలిపారు. సంఘ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ. బంగ్లాదేశ్ దేశస్థులు చేస్తున్న చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇది ఏమాత్రం ఆమోదం కాదన్నారు.