మహబూబ్ నగర్ జిల్లాలో నూతనంగా ఏర్పడిన కౌకుంట్ల మండలానికి అన్ని సౌకర్యాలు, కార్యాలయాలు ఏర్పాటు చేయాలని కోరుతూ రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి శుక్రవారం కలిసి వినతిపత్రం సమర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. కౌకుంట్ల మండలం కేవలం కాగితాలకే పరిమితం అయింది తప్ప ఇక్కడ ఎటువంటి కార్యాలయాలు లేవని అన్నారు. గత ప్రభుత్వం గెజిట్ పై నోటిఫై చేయకపోవడంతో ఇబ్బందులు ఉన్నాయన్నారు.