మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ పరేడ్ మైదానంలో 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం స్వాతంత్య్ర సమరయోధులను మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణతో కలిసి ఆయన స్వాతంత్ర సమరయోధులకు శాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు శ్రీనివాసరెడ్డి, మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.