జడ్చర్ల నియోజకవర్గం సమీపంలో దివిటిపల్లి వద్ద హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారి-44 పై పనులు కొన్ని సంవత్సరాలుగా నత్త నడకన సాగుతున్నాయి. పనులు ఒక అడుగు ముందుకు, రెండు అడుగులు వెనక్కి అన్నట్లు సాగుతున్నాయి. రహదారి పనులు నత్త నడకన సాగుతుండడంతో వాహనాలను ఒకే వరుసలో అనుమతిస్తున్నారు. దీంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రహదారి అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని శనివారం వాహనదారులు కోరుతున్నారు.