జడ్చర్ల నియోజకవర్గం మహబూబ్ నగర్- నవాబుపేట ప్రధాన రహదారిపై శుక్రవారం రెండు ద్విచక్ర వాహనాలు పరస్పరం ఢీకొనడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల తెలిపిన వివారాలు ప్రకారం. సీడి డీలక్స్ వాహనంపై ఉన్న వృద్ధుడు అలాగే ఆధునిక స్పోర్ట్స్ బైక్ పై ఉన్న ముగ్గురు యువకులు పరస్పరం ఢీకొన్నారు. ప్రమాదం జరిగినప్పుడు వాహనాలు వేగంగా ఉన్నట్టు స్థానికులు తెలిపారు. గాయపడ్డ వారిని జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు.