మహిళా సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని 13వ వార్డులో రూ. 30 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్, రూ. 10 లక్షలతో నిర్మించిన మహిళా కమ్యూనిటీ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మహబూబ్ నగర్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి ప్రజా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఆయన స్పష్టం చేశారు.