కోస్గి: హోలీ ప్రశాంతంగా జరుపుకోవాలి: సీఐ

53చూసినవారు
కోస్గి: హోలీ ప్రశాంతంగా జరుపుకోవాలి: సీఐ
హోలీ పండుగ, రంజాన్ మాసం ఉన్నందున కోస్గిలోని ప్రజలు పండుగలను ప్రశాంత వాతావరణంలో మతసామరస్యంగా జరుపుకోవాలని సీఐ తెలిపారు. గురువారం సాయంత్రం మజీద్ లోని ఇమామ్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి పండుగల సమయంలో అందరూ సంయమనం పాటించాలని, తమ పండుగలు ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. రంజాన్ మాసం సందర్భంగా ప్రార్థనలు జరిగే సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్న వెంటనే పోలీసు వారికి సమాచారం ఇవ్వాలన్నారు.

సంబంధిత పోస్ట్