కృష్ణ మండలంలోని హిందూపూర్ కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాన్ని జిల్లా విద్యాధికారి గోవిందరాజులు, మండల విద్యాధికారి నిజాముద్దీన్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులు 100% ఉత్తీర్ణత లక్ష్యంగా చదవాలని సూచించారు. అనంతరం పాఠశాలలో ఉన్న వసతులు, విద్యార్థుల భద్రత, ఆహార నాణ్యత, వసతి గదుల పరిశుభ్రత, మౌలిక సదుపాయాల స్థితిగతులను సమీక్షించారు.