మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఇటీవల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా బుధవారం మక్తల్ లో నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేశ్ గౌతమ్ పూల మొక్కను అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీహరి మాట్లాడుతూ జిల్లాలో పోలీసులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.