నర్వ మండలంలోని సిపూర్ గ్రామంలో శనివారం మహిళా సంఘాల ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతోకృషి చేస్తున్నరని అన్నారు. చుట్టుపక్కల రైతులు వినియోగించుకోవాలని దళారులకు అమ్ముకోవద్దని సూచించారు.