నారాయణపేట జిల్లా కేంద్రంలో స్థానిక నక్క రామయ్య కాలనీ దగ్గర మహీంద్రా నియెన్ షోరూమ్ ముందు మంచి నీటికి సంబంధించిన భగీరథ పైప్ లైన్ లీకేజీ కావడంతో రోడ్డుపై నీరు నిలుస్తుంది. దీంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి ఆ పైప్ లైన్ లీకేజీ సరి చేయాలని స్థానికులు కోరుతున్నారు.