నారాయణపేట మండలం కోటకొండ గ్రామంలో గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద శుక్రవారం రైతుల భూమి సమస్యల మీద ప్రభుత్వ ఆదేశాల మేరకు భూభారతి సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నారాయణపేట డిప్యూటీ తహశీల్దార్ రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతుల భూములు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు రెవెన్యూ సదస్సులో రెవెన్యూ బృందానికి తమ సమస్యలు వివరించాలని అన్నారు.