నారాయణపేట మండలం సింగారం గ్రామంలో శ్రీ గిరీ పీఠంపైన కొలువైన భవానీ మాత ఆలయంలో దేవిశరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం నుంచి ప్రారంభం అవుతాయని ఆలయ అర్చకులు శివానంద స్వామీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా గురువారం మొదటిరోజు బాలా త్రిపుర సుందరీదేవిగా అమ్మవారు దర్శనమిస్తారన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన సూచించారు.