నారాయణపేట జిల్లా కేంద్రంలోని మత్స సహకార కేంద్రంలో బుధవారం జాతీయ మత్సకార దినోత్సవం పురస్కరించుకొని, జిల్లా మత్సశాఖ అధ్యక్షులు కాంత్ కుమార్ ముదిరాజ్, జిల్లా ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు సరఫ్ నాగరాజు ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తొలకరిలో ఇచ్చు చేప పిల్లల పంపిణీలో ఎలాంటి అవినీతి జరగకుండా చూడాలని, అలాగే రైతు బీమా మాదిరిగా మత్స్య కార్మిక భీమా ఉండాలని ప్రభుత్వాన్ని కోరారు.