ధన్వాడ మండలం గున్ముక్ల గ్రామం కడప రాయుని.. గుట్టపై నూతనంగా నిర్మిస్తున్న శివాలయానికి గున్ముక్ల గౌడ సంఘం నాయకులు 3 లక్షల 16 రూపాయల విరాళాన్ని ఆలయ కమిటీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డికి అందించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షుడు, గణేష్ గౌడ్, అశోక్ గౌడ్ కరుణ ప్రసాద్ గౌడ్, బాలయ్య గౌడ్, నర్సింలు రాఘవేందర్ గౌడ్, నాగరాజు గౌడ్, నాగేశ్వర్ గౌడ్ కాసింమన్న తదితరులు పాల్గొన్నారు.