దామరగిద్ద మండలం అన్నాసాగర్ గ్రామంలో మహిళ సాధికారత ఆధ్వర్యంలో మంగళవారం హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంప్ లో గ్రామ ప్రజలకు 50 రకాల టెస్టులు చేయించారు. ఈ కార్యక్రమంలో మహిళ సాధికారికత జెండర్ స్పెషలిస్టు అనిత, నరసింహ, సీఎస్సీ టీమ్, గ్రామ యువకులు మోహన్ రాజ్, మాజీ సర్పంచ్ రాముల్, కిష్టప్ప, మహిళలు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.