నారాయణపేట జిల్లా కేంద్రానికి గతంలో మంజూరైన అంబులెన్స్ ను కోటకొండకు కేటాయించాలని ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో జిల్లా వైద్యాధికారి సౌభాగ్యాల లక్ష్మికి అనేకమార్లు వినతి పత్రాన్ని ఇచ్చాం. ఇప్పటివరకు కోటకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అంబులెన్స్ సౌకర్యం కల్పించకపోవడం దారుణం అని ప్రగతిశీల యువజన సంఘం డివిజన్ ఉపాధ్యక్షులు రవి సోమవారం అన్నారు.