ఉట్కూరు మండల్ కొత్తపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులు విద్యా వ్యవహారయాత్రకు ఆదివారం ఉదయం 8 గంటలకు బయలుదేరారు. హైదరాబాద్ లోని పలు ప్రదేశాలను సందర్శించడానికి హెచ్ఎం రవీంద్ర నాయక్, ఉపాధ్యాయుల బృందంతో విద్యార్థులు బయలుదేరారు. విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను విహారయాత్రకు పంపిస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు.