సీఎం సహాయనిధి చెక్కును శనివారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి అనుమతితో ఆయన తమ్ముడు బాధితుడి కుటుంబానికి అందజేశారు. మరికల్ మండలం పూసలపాడు గ్రామానికి చెందిన పాలెం రంగప్ప అనారోగ్యంతో ఉండగా నారాయణపేట మాజీ ఎమ్మెల్యే ఎస్సార్ రెడ్డి సహకారంతో సీఎం సహాయనిధి చెక్కును బాధితుడు రంగప్పకు ఎమ్మెల్సీ తమ్ముడు అందజేశారు.