జనవరి 9న ఇండియా డిమాండ్ డే గా జరపాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం జాతీయ కమిటీ పిలుపులో భాగంగా ఆదివారం కోటకొండ భగత్ సింగ్ చౌరస్తాలో రైతు సంఘం మండల నాయకుడు ఏం సుభాష్ అధ్యక్షతన వాల్ పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అఖిలభారత ఐక్య రైతు సంఘం జిల్లా నాయకులు ఏ రాములు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు హాజీ మలంగ్, తదితరులు పాల్గొన్నారు.